ప్రతిపక్షం, జూలై 09: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో, నేటి తీర్పుపై ఆసక్తి నెలకొంది.
కేసు విచారణ సందర్భంగా భగీరథ్ తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరగా, దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తమ అభ్యంతరాలను వెల్లడించారు. ఇరువర్గాల వాదనలను పరిశీలించిన హైకోర్టు తీర్పును వాయిదా వేసి రిజర్వ్ చేసింది.
ఇటీవల విద్యా పరీక్షలు రాసేందుకు హైకోర్టు బండి భగీరథ్‌కు వారం రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువులో పరీక్షలకు హాజరైన ఆయన, బెయిల్ గడువు ముగియడంతో కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జైలుకు వెళ్లారు.
తదనంతరం శాశ్వత బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు వెలువడనున్న తీర్పుతో ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా? లేక పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తుందా? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు నిర్ణయం కోసం ఇరుపక్షాలు ఎదురుచూస్తున్నాయి.


















