ప్రతిపక్షం, జూలై 01, వనపర్తి ప్రతినిధి: లక్ష్యసాధన కోసం బూర్జువా ప్రభుత్వాలను ఎదురించి అనునిత్యం శ్రమజీవుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం కృషి చేసిన అభ్యుదయవాది కారల్ మార్క్స్ అని మాజీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు.లండన్ సిటీలోని హైగేట్ పార్క్ లో కారల్ మార్క్స్ స్మృతి వనంలో వారి విగ్రహానికి నిరంజన్ రెడ్డి పూలమాలలు సమర్పించి కుటుంబసభ్యులతో నివాళులు అర్పించారు.ఈ సందర్భం కారల్ మార్క్స్ భావజాలం ప్రపంచ దేశాలు అనుసరించి కారల్ మార్క్స్ ను ప్రపంచ నాయకుణ్ణిగా,ప్రపంచ తత్వవేత్తగా నిలబెట్టాయని మాజీ మంత్రి. నిరంజన్ రెడ్డి అన్నారు.

















