పవన్ కళ్యాణ్‌కు గాయం.. బండ్ల గణేశ్ ఎమోషనల్

ప్రతిపక్షం, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భుజాలకు తీవ్ర గాయమైనట్లు వెలుగులోకి రావడంతో నిర్మాత బండ్ల గణేశ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత రాత్రంతా నిద్రపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘గబ్బర్ సింగ్’ సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ గుర్రంపై నుంచి కిందపడిన ఘటనను గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినప్పటికీ, నిర్మాతకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ తన కోసం చూపిన ఆ నిబద్ధతను జీవితాంతం మరచిపోలేనని, ఆ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Spread the love

Related News

Latest News