ప్రతిపక్షం, పెద్దపల్లి : లోకసభ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పార్లిమెంట్ నియోజకవర్గ, మంథని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ గా ఎర్రవెల్లి విలాస్ రావునీ బుధవారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కే. శివసేన రెడ్డి నియమించారు. ఈ సంధర్బంగా విలాస్ రావు మాట్లాడుతూ.. తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుకి ధన్యవాదాలు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు.