జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ: మంత్రి వాకిటి శ్రీహరి

ప్రతిపక్షం, జూన్ 06: హైదరాబాద్‌లో నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వచ్ఛందంగా హాజరవుతున్నారని చెప్పారు.

ఈసారి లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా మూడు లక్షలకు పైగా చేపపిల్లలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. చివరి వ్యక్తి వరకు ప్రసాదం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై, జూన్ 9వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. గత సంవత్సరాల కంటే ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేసి, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

కార్యక్రమంలో 200 మందికి పైగా మత్స్యశాఖ సిబ్బంది సేవలందించనున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా నమ్మకంతో కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

Spread the love

Related News

Latest News