కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలు ఇవే!

ప్రతిపక్షం, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నమోదవుతున్న కరోనా కేసుల్లో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ సోకిన వారిలో కనిపించే సాధారణ లక్షణాలను వెల్లడించారు.

గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం, అలసట, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

అయితే ఈ లక్షణాలు సాధారణ కరోనా లక్షణాలేనని, ప్రస్తుతం గుర్తించిన ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 వేరియంట్ ప్రమాదకరమైనదిగా కనిపించడం లేదని తెలిపారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.

Spread the love

Related News

Latest News