తెలంగాణలో కాసేపట్లో వర్షాల జల్లులు.. పలు జిల్లాలకు వాతావరణ నిపుణుల హెచ్చరిక

ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న గంటలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని సూచిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.

వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, ఉరుములు మెరుపులు సంభవించే వేళ అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News