టమాటా ధరలకు రెక్కలు.. కిలో రూ.100 దాటిన ధర

ప్రతిపక్షం, జూన్ 17: తెలంగాణలో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు భారంగా మారాయి. హైదరాబాద్ నగరంలోని బహిరంగ మార్కెట్లు, కూరగాయల దుకాణాల్లో టమాటా కిలో ధర రూ.100 వరకు చేరుకుంది. రైతు బజార్‌లలోనూ నాణ్యమైన టమాటా కిలో రూ.80కుపైగా విక్రయిస్తున్నారు.

గత వారం వరకు రూ.60 నుంచి రూ.80 మధ్య ఉన్న ధరలు, ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు టమాటా సాగు విస్తీర్ణాన్ని తగ్గించగా, వేసవి ప్రభావంతో దిగుబడి కూడా తగ్గింది. ఈ కారణాల వల్ల మార్కెట్‌లో సరఫరా తగ్గి ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

Spread the love

Related News

Latest News