ప్రతిపక్షం, జూలై 02: గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఇటీవల ఎన్నికైన కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆకుల చంద్రశేఖర్‌ను గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణపై కూడా కమిటీ చర్చించే అవకాశముంది.

















