Trending Now

కాంగ్రెస్ యువనేతను పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 16 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సాన్నిహిత్యంగా ఉంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత స్థాయి కాంగ్రెస్ పార్టీ యువనేతగా ఎదుగుతున్న సయ్యద్ అర్జుమంద్ అలీ నానమ్మ ఇటీవల స్వర్గస్తురాయలయ్యారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలోని ఇస్లాం పురాలో గల సయ్యద్ అర్జుమంద్ అలీ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్, బీజేపీ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మున్సిపల్ ఛైర్మన్ లు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడంలో సయ్యద్ అర్జుమంద్ అలీ కీలక పాత్ర పోషిస్తూ జిల్లాలో ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఈ నేపథ్యంలో అర్జుమన్ అలీ ను రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వయాన ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం స్థానిక రాజకీయ నాయకులలో చర్చాంశానీయంగా మారింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెంట మున్సిపల్ కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్లా ఖాన్ ,తోహిదొద్దీన్ రఫ్ఫూ, మాజీ డీసీసీబీ చైర్మన్ నారాయణరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు బషీరుద్దీన్ బహదూర్ ఖాన్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News