Trending Now

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే పట్టం కట్టాలి..

ప్రతిపక్షం, దుబ్బాక, మే 1: కేవలం నాలుగు మాసాల పాలనలో తెలంగాణ ప్రజలకు పాలేవో, నీళ్లేవో తెలిసిపోయిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. బుధవారం తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలు పణంగా పెట్టి మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించడంతో పాటు బీడు భూముల్లో గోదావరి నీళ్లను పారించాడన్నారు. ఇంటింటికి తాగునీళ్లు, రైతుబంధు, రైతు బీమా, 200 పించన్ ను 2,000 లకు పెంచడం జరిగిందన్నారు. ఎన్నికల్లో 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను బుట్టధాఖలు చేయడం జరిగిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, కేసీఆర్ తెలంగాణ ప్రజల కేంద్రంగా పనిచేస్తారని తెలిపారు. కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డి 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసి ఘన విజయం అందించాలని కోరారు. అనంతరం గ్రామంలోని సోమినోని కుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల కూలీల వద్దకు వెల్లి బి ఆర్ ఎస్ పార్టీ కి ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య, బూత్ అధ్యక్షులు డబ్బికారి పెంటోజి, పిట్ల వెంకటయ్య, సీనియర్ నాయకులు పాత్కుల వెంకటేషం, జీడిపల్లి మోహన్ రెడ్డి, సుతారి రాములు, బండారు స్వామిగౌడ్, సిరిసిల్లా రాజేశం, ఎర్రోల్ల చంద్రం, పాత్కుల బాలేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News