ప్రతిపక్షం, జూలై 29: జెన్-జీ నిరసనలకు సంబంధించిన రీల్స్‌పై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు సోనూసూద్ తీవ్రంగా స్పందించారు.
యువతను ఎప్పుడూ గౌరవించాలని, వారి అభిప్రాయాలను వినాలని సోనూసూద్ అన్నారు. నటులుగా తాము ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులు, ముఖ్యంగా యువతే కారణమని పేర్కొన్నారు. ఏ రంగంలో ఉన్నా ప్రజలతో అనుబంధం కొనసాగించడం ఎంతో ముఖ్యమని చెప్పారు.
కంగనా నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది యువతను అవమానించినట్లేనని వ్యాఖ్యానించిన సోనూసూద్, ప్రజా జీవితంలో ఉన్నవారు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ప్రజలే దేవుడి ప్రతిరూపమని, వారి భావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

















