Trending Now

ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం..

ప్రతిపక్షం, హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. అంతకుముందు పోతారం గ్రామ కూడలి వద్ద మల్లెచెట్టు చౌరస్తాలో బీజేపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వాళ్ళు చించి వేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వ్యక్తి గత విమర్శలను వెంటనే వెన్నక్కి తీసుకోవాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కు శ్రీనివాస్, గొర్ల ఐలేష్ యాదవ్, పెరుమాండ్ల నర్సాగౌడ్, మైదంశెట్టి వీరన్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love