[t4b-ticker]

‘చాందీపుర వైరస్’ కలకలం.. 45 రోజుల్లో 27 మంది చిన్నారుల మృతి

ప్రతిపక్షం, ఆగస్టు 14: గుజరాత్‌లోని పలు జిల్లాల్లో చాందీపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కేవలం 45 రోజుల వ్యవధిలో ఈ వైరస్‌ కారణంగా 27 మంది చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

చాందీపుర వైరస్‌ సాధారణంగా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకర వైరస్‌గా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తికి ఈగలు, దోమలు వంటి కీటకాలు కారణమవుతాయని భావిస్తున్నారు. అయితే వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే వేలాది కీటకాలను సేకరించి పరీక్షలు నిర్వహించినప్పటికీ, వాటిలో వైరస్‌ ఆనవాళ్లు గుర్తించకపోవడం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

వైరస్‌ వ్యాప్తికి అసలు కారణం ఏమిటన్న దానిపై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు దృష్టి సారించారు. వివిధ ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తూ వ్యాప్తి తీరును అధ్యయనం చేస్తున్నారు. చిన్నారుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

27 మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ప్రభావిత జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తికి కారణాలను త్వరగా గుర్తించి, మరింతగా విస్తరించకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు.

Spread the love

Related News

Latest News