Trending Now

ఆరోపణల్లో వాస్తవం లేదు..

రాజకీయంగా ఎదుగుదలను చూసి ఆరోపణలు..

షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొండుటి నరేందర్

ప్రతిపక్షం, షాద్ నగర్: పాత హైవే విస్తరణ లో భాగంగా ఊదోదయ సోయర్ మార్కెట్ ప్రహరీ గోడ కూలుస్తే, నేను కూల్చేసినట్టు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని మున్సిపల్ చైర్మన్ కొండుటి నరేందర్ తెలిపారు. ఇవాళ మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు లేని నాడు ఏనాడు నేను షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయలేదన్నారు. తాను అధికార దుర్వినియోగం చేయలేదన్నారు. నా స్థలానికి పక్కన ఉన్న ఉషోదయ భవన ప్రహారిని నేను తొలగించలేదనీ, పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అనవసరంగా తనపై అభాండాలు మోపి తన పరువు తీసే విధంగా మండవ మురళీధర్ రావు వ్యవహరించారని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పాత హైవే రోడ్డులో తన స్థలం పక్కన ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్ భవన యజమాని మండల మురళీధర్ రావు తనపై అర్థంలేని ఆరోపణలు చేశారని విమర్శించారు. తాను మునిసిపల్ నిబంధనలను అనుసరించి సెట్ బ్యాక్ వదిలి భవనం కట్టుకున్నానని తన పక్కన ఉన్న మండవ మురళీధర్ రావు ఉషోదయ భవన నిర్మాణం తనుకున్నది ఎంతవరకు సెట్ బ్యాక్ ఉందో ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నరేందర్ సూచించారు. పాత హైవే రోడ్డు పెద్ద ఎత్తున విస్తరణ పనులు జరుగుతున్నాయని ఇందులో భాగంగా ఆర్ అండ్ బి అధికారులు మున్సిపల్ శాఖకు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో దాదాపు పరిగి రోడ్ జంక్షన్ నుండి అన్నారం జంక్షన్ వరకు మున్సిపల్ లిమిట్స్ లో దాదాపు 45 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణలో భాగంగా సైడ్ డ్రైన్స్ ఇతర మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. వెంకటేశ్వరరావు నుండి స్థానిక మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్నకు ఏప్రిల్ 16న లేఖ కూడా అందిందని తెలిపారు. లేఖ సంఖ్య ఎల్ఆర్ నెంబర్ ఈఈ/సిడి/ డిబి/ డి/1 2024 – 25/ 20 ప్రకారం.. ఉత్తర్వులు కూడా వచ్చాయని ఇందులో భాగంగా ఆర్ అండ్ బి మున్సిపల్ శాఖ సంయుక్తంగా రోడ్డు విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ కాలువ నిర్మించేందుకు స్థలాలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా అధికారులు సెట్ బ్యాక్ కానీ ప్రహరీ గోడను సిబ్బంది కూల్చివేశాలని ఇందులో తన ప్రమేయం ఏముందని? మున్సిపల్ చైర్మన్ నరేందర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు కూడా ఏలాంటి ఇబ్బందులను ఇతరులకు గురి చేయలేదని పేర్కొన్నారు. తను పదవిలో ఉన్న లేకపోయినా ఎప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టబోనని అన్నారు. మండవ మురళీధర్ రావు ఎందుకు తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయాల్సి వచ్చిందో తెలియదని అది ఆయన విచక్షణకే వదిలి వేస్తున్నానని అన్నారు.

నాపై బురద జల్లడం మానేయండి..

కూల్చివేతల విషయంలో రాజకీయంగా ద్దుగుతున్న తనను అప్రతిష్ట పాలు చేయాలన్నా తపన్ తో మండవ మురళీధర్ రావు వ్యవహరించడం సభ్యత కాదని తనపై బురద జల్లడం మానేయాలని నరేందర్ కోరారు. అర్థం పర్థం లేని ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ప్రహరీ గోడ కూల్చివేత అంశంలో పక్కాగా అధికారులే నిబంధనలకు అనుగుణంగా గోడను తొలగించారని ఇప్పటికే డ్రైన్ పనులు ప్రారంభం అయ్యాయని ఇవన్నీ చూడకుండా తనకు అప్రతిష్ట వచ్చే విధంగా ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. మండవ మురళీధర్ రావు అనే వ్యక్తి తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని మంచిగా పలకరించే వారని తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటో? ఇప్పటికీ అర్థం కాలేదని అన్నారు. అసలు మండవ మురళీధర్ రావు ఇతరులు కట్టిన భవనాన్ని కొన్నారని అతను దర్డ్ పార్టీ అని ఈ సందర్భంగా చెప్పారు. గతంలో ఈ భవనాన్ని నిర్మించిన శ్యామ్ అనే వ్యక్తి ఇతరులకు అమ్మేడని ఆ తర్వాత అతను కూడా ఈ భవనాన్ని విక్రయిస్తే మండవ మురళీధర్ రావు మూడో వ్యక్తిగా దీనిని కొన్నారని పేర్కొన్నారు.

భువన నిర్మాణ సమయంలో మున్సిపాలిటీకి అప్పట్లో భవన యజమాని అయిన కీర్తిశ్యామ్ అనే వ్యక్తి సెట్ బ్యాక్ అంశంలో మున్సిపాలిటీకి సహకరిస్తానని నిర్మాణం చేపట్టాడని నిబంధన ఆనుగుణంగా మున్సిపాలిటీకి అగ్రిమెంట్ చేసిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. భవన అనుమతులకు సంబంధించి ఆయన సంబంధిత పత్రాలను విలేకరులకు చూపించారు. దాదాపు 25 నుండి 30 ఫీట్ల వరకు సెట్ బ్యాక్ చేయకుండా రోడ్డును ఆక్రమించారని ఈ సందర్భంగా నరేందర్ సంచలన విషయాలు వెల్లడించారు. తనకు ఎవరి ట్రాన్స్ఫార్మర్ అడ్డం లేదని తన స్థలం తనకు పక్కాగా ఉందని తను సెట్ బ్యాక్ అయి కట్టుకున్నానని ఇతరులపై ఆరోపణలు వేసే ముందు అవతల వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడో చూడాలని మీడియాకు వివరించారు. వాస్తవానికి ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తే అక్కడ పరిస్థితి వేరేగా ఉంటుందని హెచ్చరించారు. బతకడానికి వచ్చిన వారిపై జులుం చేశారన్న ఆరోపణలు సరైనవి కావనీ స్థానికుల కంటే బయటి వారే ఇక్కడ ఎక్కువగా బతుకుతున్నారన్న విషయం మరిచిపోకూడదని స్థానికులు మంచివారని ఎవరి జోలికి వెళ్లరని నరేందర్ తెలిపారు.

అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వండి..

పట్టణ అభివృద్ధి విషయంలో ప్రజలు భవన యజమానులు మున్సిపాలిటీకి సహకరించాలని చైర్మన్ కే. నరేందర్ స్పష్టం చేశారు. అభివృద్ధి అంశంలో ప్రతి ఒక్కరు సహకరిస్తేనే భవిష్యత్ తరాలకు అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయని అందరూ ఇలా ఖచ్చితంగా ఆలోచిస్తే వసతుల విషయంలో భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వారం అవుతామని చైర్మన్ నరేందర్ తెలిపారు. అభివృద్ధికి అందరూ ప్రాధాన్యత ఇచ్చే విధంగా స్వచ్ఛందంగా స్పందించాలని అన్నారు. రోడ్ల విషయంలో ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలు సహకరిస్తేనే పట్టణం బాగుపడుతుందని అన్నారు. అనవసరమైన వివాదాలకు ఆరోపణలకు విమర్శలకు పోతే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాలు రోడ్లను నిర్మిస్తున్నాయని అత్యంత సుందరీకరణగా పట్టణం మారుతుందని దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News