Trending Now

వర్తమన్నూర్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

ప్రతిపక్షం, బోథ్, జూన్ 14:

అదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఉంటి నిట్టాడి ఇల్లు దగ్ధమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాల మేరకు వర్త మన్నూర్ గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన ఈదుల్ల లింగన్న చెందిన ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఇంటిని చుట్టుముట్టాయి. స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో పాటు ఇచ్చోడ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. హుటాహుటి నా సంఘటన స్థానానికి చేరుకున్న ఫైర్ అధికారులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇల్లు మొత్తం కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. అగ్ని ప్రమాదంలో. 5 లక్షల రూపాయలు బీరువా మంచాలు, సర్వం కాలిపోవడంతో నిరాశ్రములయ్యారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఉన్నత అధికారులు సమాచారం అందించారు అగ్ని ప్రమాద బాధితులను స్వచ్ఛంద సంస్థలు దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love

Related News