Trending Now

మహిపాల్ రెడ్డి సోదరుడి అరెస్ట్ పై స్పందించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనికి టిఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పుకోక పోతే కేసులు పెడుతున్నారని ఫైరయ్యారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ని అరెస్టు చేయటం అక్రమని అరెస్టు చేసేటపుడు ప్రొసిజర్ ఉంటుంది. ప్రజాస్వామ్య రహితంగా అరెస్టు చేయటం ఘోరం పదేళ్లలో ఎప్పుడూ బిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని తెలిపారు. జిల్లా మంత్రి రాజనర్సింహ ఆదేశాలతోనే అధికారులు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. మూడునెలల కాల వ్యవధిలో మూడవ కేసు పెట్టారు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. ప్రతిపక్షాలపై గ్లొబెల్ ప్రచారం చేస్తూ.. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని అనుమతులు ఉన్నా వేదించే కార్యక్రమం చేయటం తప్పు.. న్యాయస్థానానికి వెళతాం.. న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Latest News