[t4b-ticker]

చేనేత రంగానికి చేయూత: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 07: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి కష్టానికి అంకితభావానికి సెల్యూట్, మన సంస్కృతి సాంప్రదా యాలను ప్రపంచాని కి చాటి చెబుతున్న చేనేత కళాకారులం దరికి జాతీయ చేనేత దినోత్సవం సందర్భం గా శుభాకాంక్షలు తెలియజేశారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ విప్, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని నేతన్న విగ్రహానికి జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల చేనేత, వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా అండ గా నిలుస్తోందన్నారు. సిరిసిల్లలోని నేతన్న లు, కార్మికులు, ఆసా ములు, యజమాను లకు సంవత్సరంలో సుమారు ఎనిమిది నెలల పాటు పని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

గత ఏడాది 6 కోట్ల 70 లక్షల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని, ఈ ఏడాది ఇప్పటికే 4 కోట్ల 50 లక్షల మీటర్ల చీరల తయారీకి అవకాశం కల్పించా మని తెలిపారు. త్వరలో మరో కోటి 50 లక్షల మీటర్లకు పైగా ఆర్డర్లు జారీ చేయనున్నట్లు వెల్ల డించారు. ప్రభుత్వ పాఠశాలల యూని ఫాంలు, ఇతర అవ సరాలకు సంబంధిం చిన వస్త్రాల తయా రీ ద్వారా కూడా స్థానిక నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నా మని పేర్కొన్నారు. త్రిఫ్ట్ పథకం ద్వారా నేతన్నల పొదుపు నకు ప్రభుత్వం సమా నంగా చేయూతని స్తోందని, నేతన్నల బీమా పథకం కింద సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 129 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిం చినట్లు చెప్పారు.

Spread the love

Related News

Latest News