Trending Now

IPL-2024: నేడు కోల్‌కతాతో రాజస్థాన్ రాయల్స్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచులు జరిగాయి. వీటిలో KKR 14, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలిచాయి. అయితే హోంగ్రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై నైట్ రైడర్స్‌దే పైచేయిగా ఉంది. పాయింట్ల పట్టికలో RR, KKR తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ మ్యాచులో గెలిచిన జట్టు తొలి స్థానానికి ఎగబాకనుంది.

డీకే అద్భుత పోరాటం.. అయినా SRH గెలుపు

నిన్న జరిగిన మ్యాచ్‌లో RCBని సొంతగడ్డపైనే SRH ఓడించింది. తొలుత SRH 287 పరుగులు చేయగా.. బెంగళూరు 262 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ 25 రన్స్ తేడాతో గెలిచింది. వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వీర విహారం చేశారు. 35 బంతుల్లో 83 పరుగుల (7 సిక్సర్లు, 5 ఫోర్లు)తో ఒంటరి పోరాటం చేశారు. కోహ్లీ 42(20), డుప్లెసిస్ 62(28) రాణించారు. కమిన్స్ 3 వికెట్లు, మార్కాండే 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

IPL-2024లో భారీ సిక్సర్..

SRHపై ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ బాదారు. నటరాజన్ వేసిన బంతిని 108 మీటర్ల దూరం కొట్టారు డీకే. ఆ బాల్ స్టేడియం పై రూఫ్‌ను తాకి మైదానంలో పడింది. ఐపీఎల్-2024లో ఇప్పటివరకు ఇదే లాంగెస్ట్ సిక్సర్. ఇదే మ్యాచులో SRH బ్యాటర్ క్లాసెన్ 106 మీటర్ల సిక్స్ కొట్టారు. ఈ సీజన్లోనే పూరన్, వెంకటేశ్ అయ్యర్ సైతం 106 మీటర్ల సిక్సర్లు బాదారు.

Spread the love

Related News