ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. ‘బ్రిటిష్ పాలకులపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి పేరు వింటేనే ఒక మహోజ్వల శక్తి, స్ఫూర్తి అందరికీ అందుతాయి. సమాజం కోసం ఆలోచించి బాధిత వర్గాలకు బాసటగా నిలవాలని ఆ యోధుడి జీవితం తెలియజేస్తుంది. గిరిజనుల కోసం పోరాడిన మన్యం వీరుడి స్ఫూర్తిని నవతరం కొనసాగించాలి’ అని ట్వీట్ చేశారు.