Trending Now

మేడారం వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

ప్రతిపక్షం, తెలంగాణ: మేడారం వెళ్తోన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News