ప్రతిపక్షం, జూలై 21: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈ ఘటనపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని ఆయన నేతృత్వంలోని విపక్ష నేతలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ ఆప్, కాంగ్రెస్ సహా పలు పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.



















