ప్రతిపక్షం, జూలై 21: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను పాముతో కాటు వేయించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దామినిని ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసులు జైలుకు తరలించారు. గతంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్ములో దాచిన కేసులో జైలులో ఉన్న ముస్కాన్ రస్తోగి ఉన్న బ్యారక్‌లోనే దామినిని ఉంచారు.
అయితే తన ప్రియుడు తుషార్‌ను ఒక్కసారి కలవాలని దామిని పదేపదే కోరుతూ ఏడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడే తనకు సర్వస్వమని ఆమె చెబుతున్నట్లు వెల్లడించారు.


















