ప్రతిపక్షం, జూలై 21: పార్లమెంట్ ముట్టడి నిరసన ఇవాళ కూడా కొనసాగుతుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. నిన్న రాత్రి నిరసనల అనంతరం ఆందోళనకారులు తిరిగి జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్‌మంతర్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. మళ్లీ పార్లమెంట్ ముట్టడికి వెళ్తామని తెలిపారు. కాగా, తొలిరోజు ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.


















