ప్రతిపక్షం, జూలై 21: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశంలో గూండాగిరి, నిరంకుశత్వం ఇకపై నడవదంటూ నినాదాలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, అణచివేత చర్యలకు పాల్పడటాన్ని నిరసిస్తూ ఈ ధర్నా నిర్వహించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.



















