ప్రతిపక్షం, జూలై 21: దేశంలో 152 ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన వారు స్వేచ్ఛగా తిరుగుతుండగా.. న్యాయం కోసం ప్రశ్నించిన యువతపై లాఠీచార్జ్ చేసి, ఈడ్చుకెళ్లి నిర్బంధిస్తున్నారని విమర్శించారు.
యువతకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రధాని మోదీ.. కనీసం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా కోరలేకపోతున్నారని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు.


















