మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్
ప్రతిపక్షం, హైదరాబాద్, ఏప్రిల్ 16: రానున్న వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక తో పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎం.డి సుదర్శన్ రెడ్డి తో కలిసి జిహెచ్ఎంసి పరిధిలో మాన్సూన్ ముందస్తు ఏర్పాట్ల పై ఈ.ఎన్.సి, జోనల్ కమిషనర్ లు, యస్ ఈ లు, తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలతో నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం వాటిల్లకుండా ముందస్తు ప్రణాళికతో పూర్తి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డి.ఆర్.ఎఫ్) అన్నివేళలా అప్రమత్తమై సిద్ధంగా ఉండాలన్నారు. ఫైర్, వాటర్, జిహెచ్ఎంసి, పోలీస్ తదితర శాఖలన్నీ కలిసి మే నెల చివరి వారంలో గాని, జూన్ మొదటి వారంలోగా మాక్ డ్రిల్ ఏర్పాటు చేయాలని, ప్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలన్న దానిపై చేసి చూపాలని, ఏదైనా ఆపద సంభవిస్తే ఆయా అధికారులు వచ్చి అండగా ఉంటారన్న నమ్మకం ప్రజలకు కల్పించాలన్నారు. రెగ్యులర్ పూడిక తీత ( డిసిల్టింగ్) పనులు ప్రజలకు అవగాహన కోసం ఎగ్జిబిషన్ పెట్టాలని, వరద ముంపు కోసం చేపట్టిన పనులు 52 శాతం పూర్తైనవని, మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 125 వాటర్ లాగిన్ లొకేషన్స్ గుర్తించారని, 22 లొకేషన్స్ లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారని, 40 లొకేషన్‌లలో ఉన్నయుద్ధ ప్రాతిపదికన తొలగించుటకు పర్సనల్‌గా వెళ్లి పరిశీలించి శాశ్వతంగా పరిష్కరించాలని, మిగతా లొకేషన్లలో కూడా వాటర్ నిల్వ కుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ ఈ లకు సూచించారు. కల్వర్టులను శుభ్రం చేయించాలని కల్వర్టుల వద్ద ఇతర యుటిలిటీ లను తొలగించేందుకు, ప్లాన్ చేయాలన్నారు. జూన్ ఫస్ట్ వీక్ లోగా నాలా లన్నింటిని శుభ్రం చేసుకోవాలన్నారు.
1304 కి.మీ.పొడవు నాలాలు వున్నాయని, నాలలో అవాంచనీయ సంఘటనలు జరగ కుండా భద్రత చర్యలో బాగంగా నాల ఆడిట్ చర్యలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రజలు నాళాలలో చెత్త వేస్తున్నారని, నాలాలలో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించాలన్నారు. అక్కడ చిన్న చిన్నచెత్త డబ్బాలు ఏర్పాటు చేసి, చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల కోసం చేపడుతున్న మాన్ సూన్ ప్రిపేర్డ్ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కోరారు. క్రమం తప్పకుండా చేసిన పనులు, జరుగుతున్న పనుల ప్రజలకు తెలియజేయాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అంతకు ముందు జోన్ వారీగా చేపట్టిన పనులు, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సంసిద్ధత పై ఆయా జోనల్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ కి వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈ యెన్ సి జియా ఉద్దీన్, జోనల్ కమిషనర్లు రవి కిరణ్, బోర్కాడే హేమంత్ సహదేవ్ రావు, స్నేహ శబరుష్, అభిలాష అభినవ్, పంకజ వెంకన్న, సీఈ లు దేవానంద్, కిషన్ లేక్స్ యస్ ఈ ఆనంద్, జోనల్ యస్ ఈ లు అశోక్ రెడ్డి, చిన్న రెడ్డి, అనిల్ రాజ్, తదితరులు పాల్గన్నారు.