[t4b-ticker]

హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు అదృశ్యం.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో చివరి జాడ

ప్రతిపక్షం, జూలై 20: హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వలస కార్మికుల కుటుంబాలకు చెందిన ఈ బాలికలు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ముగ్గురు బాలికలు కాచిగూడ రైల్వే స్టేషన్‌ వరకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

బాలికలు ఎక్కడికి వెళ్లారు? ఎవరితోనైనా వెళ్లారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం రైల్వే స్టేషన్‌ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

Spread the love

Related News

Latest News