‘రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్ గుర్తుందా?’: కేటీఆర్

ప్రతిపక్షం, జూలై 18: సరూర్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగ సంగ్రామ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

‘‘గతంలో రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి బిస్కెట్లు తిని, మనకూ పంచారు. కేసీఆర్ ఉద్యోగాలు తీసేశారని చెప్పి.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేశారు. రాహుల్ గాంధీ.. ఆనాడు నిరుద్యోగులను మోసం చేసిన అశోక్‌నగర్ గుర్తుందా?’’ అని కేటీఆర్ నిలదీశారు.

Spread the love

Related News

Latest News