రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

•అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు

•జిల్లాలో మొత్తం 1 లక్ష 45 వేల 543 మంది రైతులకు గాను.

•రూ.102 కోట్ల 59 లక్షల 46 వేల 419 రూపాయల రైతు భరోసా నిధులు జమ

వనపర్తి ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డి

ప్రతిపక్షం, జూలై 02, వనపర్తి ప్రతినిధి: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా వానకాలం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు.వనపర్తి జిల్లాలో మొత్తం 1 లక్ష 45 వేల 543 మంది రైతులకు గాను…రూ.102 కోట్ల 59 లక్షల 46 వేల 419 రూపాయల భరోసా నిధులను వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.రైతులకు సాగు కాలంలో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.రైతుల కష్టాలను అర్థం చేసుకుని వారి అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి. ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి.ఎనుముల రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావులకు వనపర్తి జిల్లా రైతుల తరఫున ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Spread the love

Related News

Latest News