వరంగల్‌కు రేపు పవన్ కళ్యాణ్

ప్రతిపక్షం, జూన్ 16: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడి చివరి కోరిక మేరకు అతడిని కలిసి పరామర్శించనున్నారు. అనంతరం వరంగల్‌లోని ప్రముఖ భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇటీవల తెలంగాణ స్థానికత అంశంపై జరిగిన రాజకీయ చర్చల నేపథ్యంలో పవన్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది. ఇదిలా ఉండగా, తెలంగాణలో పార్టీ విస్తరణపై దృష్టి సారించిన జనసేన త్వరలోనే జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది.

Spread the love

Related News

Latest News