Trending Now

పోటీకి ససేమిరా.. వారసులకైతే ‘సై’

ప్రతిపక్షం, ఢిల్లీ/ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో తలపండిన నేతలు లోక్ సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నారు. కొందరు కుమారులను బరిలో దింపే యోచనలో ఉన్నారు. సోనియాగాంధీ అనారోగ్య కారణంతో ఇప్పటికే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పోటీకి సముఖంగా లేరు. నలుగురు మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోత్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, హరీశరావత్ కూడా అదే దారిలో ఉన్నట్లు సమాచారం. రావత్, గెహ్లోత్ వంటి వారు వారసులను పోటీకి పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సోమవారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటి రెండవ సమావేశానికి కూడా సీనియర్ లు అందరు హాజరు కాలేదు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అస్సోం, ఉత్తరా ఖండ్ రాష్ట్రాలలోని 62 స్థానాలకు అభ్యర్థిత్వాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా.. తెలంగాణలో ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకుంటున్న తనను పట్టించుకోవడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తన పోటీకి స్థానికత అడ్డొస్తుందంటున్నారని, గతంలో పోటీ చేసిన నాదెండ్ల భాస్కరరరావు, రేణుకా చౌదరి స్థానికులా..? అని పీసీసీ అధ్యక్షుడు, మఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

Spread the love

Latest News