ప్రతిపక్షం, జూన్ 04: ఒక సాధారణ గ్రామానికి క్రీడల ద్వారా గుర్తింపు తీసుకురావాలనే యువకుడి ప్రయాణమే ‘పెద్ది’ కథ. ప్రధాన పాత్రలో రామ్‌చరణ్ నటన, శారీరక రూపాంతరం, క్రికెట్, కుస్తీ పోటీల సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి బలంగా నిలిచాయి.
జగపతిబాబు, శివరాజ్‌కుమార్ పాత్రలు కథకు మరింత బలం చేకూర్చాయి. అయితే భావోద్వేగ సన్నివేశాలను ప్రేక్షకులతో పూర్తిగా అనుసంధానం చేయడంలో దర్శకుడు కొంత మేర విఫలమైనట్లు అనిపిస్తుంది. కథానాయిక పాత్ర ప్రభావం కూడా ఆశించిన స్థాయిలో కనిపించదు.
ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు, క్లైమాక్స్ కొంత సాగదీతగా అనిపించినప్పటికీ, రామ్‌చరణ్ నటన కోసం సినిమా చూడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

















