Trending Now

బోల్సా గ్రామ దళిత మహిళలపై దాడి హేయమైన చర్య..

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 29: ముదోల్ నియోజకవర్గం తానూర్ మండలం బోల్సా గ్రామంలో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో మతోన్మాద అల్లరి మూకలు మహిళలపై దాడి చేయడం హేయమైన చర్యగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ పేర్కొన్నారు. బాధితులతో కలిసీ స్థానికంగా ఈరోజు ఆందోళన చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటు జై బీమ్ నినాదం చేస్తూన్న దళిత ప్రజలపై ఉన్మాదులు దాడి సర్వసమాజము సిగ్గుపడేలా వ్యవహరించారని దోషులను వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలనలో విపరీతంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని, రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలనలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి కారణం పాలక పాలకవర్గాల వైఫల్యం అని విమర్శించారు.

బడుగు బలహీన వర్గాలకు అధికారమొస్తేనే దాడులు జరగవని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన రాజ్యం కోసం కలలు కన్నారని బాబాసాహెబ్ కలలు నిజం చేయాలని అందరు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ నాయకులు జిల్లా మహిల కన్వీనర్‌ఎస్ కే. లక్షీ యాదవ్, రాజేశ్వర్, సునీల్, గైక్వాడ్, సుదా, నాగమనీ, సవిత, వాగ్మరే ఆకాష్, గ్రామ ప్రజలు బాధితులు పాల్గొన్నారు.

Spread the love

Related News