ప్రతిపక్షం, జూన్ 10: మీనాక్షి నటరాజన్‌కు సంబంధించిన కేసు పత్రాలు తమకు అధికార పార్టీ నేతల ద్వారానే చేరాయని కేంద్ర మంత్రి కైలాశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పత్రాలను ఎవరు బయటకు ఇచ్చారు, పార్టీలో కోవర్టు ఎవరు అనే అంశాలపై పార్టీ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలో కొన్ని అంశాలపై మీనాక్షి కొందరు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, వారిలో కొందరి ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత కీలక పాత్ర పోషించి ఉండవచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

















