ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కీలక సూచనలు చేసింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ఇమామ్లు, మౌజన్లను వక్ఫ్ బోర్డు కోరింది. ఈ మేరకు సంబంధిత మతపెద్దలకు సర్క్యులర్ జారీ చేసింది. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు, ప్రజలకు ఉపశమనం కలగాలని ప్రార్థనలు చేయాలని సూచించింది.

















