ప్రతిపక్షం, జూలై 07: హైదరాబాద్‌లో ఓ వ్యాపారిని నమ్మించి రూ.7.48 లక్షల విలువైన పప్పులు, ధాన్యాలు తీసుకుని డబ్బులు చెల్లించకుండా మోసానికి పాల్పడిన ఇద్దరిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ధనలక్ష్మి ట్రేడర్స్ యజమాని అకునూరి అశోక్, అతని డ్రైవర్ ధర్మేంద్ర సింగ్‌పై కేసు నమోదు చేసి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

















