పాస్‌పోర్ట్ వ్యాఖ్యలపై ఒవైసీకి కిషన్‌రెడ్డి ప్రతిస్పందన

ప్రతిపక్షం, జూన్ 26: పాస్‌పోర్ట్, పౌరసత్వ గుర్తింపుపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విమర్శించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఒవైసీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

పాస్‌పోర్ట్‌కు, పౌరసత్వ గుర్తింపుకు మధ్య ఉన్న చట్టపరమైన తేడాను అర్థం చేసుకోకుండా మాట్లాడటం బాధాకరమని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధిగా, న్యాయ విద్య అభ్యసించిన వ్యక్తిగా ఒవైసీకి ఈ అంశంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టించే వ్యాఖ్యలను నివారించాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పౌరసత్వానికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలను అధ్యయనం చేసిన తర్వాతే ఈ అంశంపై స్పందించాలని ఆయన సూచించారు.

Spread the love

Related News

Latest News