ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం.. జులై 22కు హైకోర్టు విచారణ

ప్రతిపక్షం, జూన్ 26: పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. పార్టీ మారిన పది మంది మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం విచారించింది.

ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రతులను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే స్పీకర్‌తో పాటు సంబంధిత ఎమ్మెల్యేలు తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేయాలని మరోసారి నోటీసులు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను జులై 22కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరాయింపు వ్యవహారంపై న్యాయస్థానం తదుపరి విచారణలో కీలక అంశాలను పరిశీలించనుంది.

Spread the love

Related News

Latest News