Trending Now

కాంగ్రెస్ గెలిస్తేనే సామాన్యులకు సరైన న్యాయం..

టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 25 : కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాన్యులందరికీ సమన్యాయం జరిగి సంక్షేమ బాట పడతారని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. గురువారం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్ర పరిసరాలలో ఉపాధి కూలి పని చేస్తున్న కూలీలతో మాట్లాడారు. ఉపాధి కూలీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమేదే నని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్నివర్గాల నడ్డి విడిచేలా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ పద్ధతులను అవలంబిస్తూ దేశాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులలో నెట్టివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

సామాన్యులందరికీ సరైన న్యాయం జరగాలంటే సుస్థిర పాలనను అందించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని కోరారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. విపరీతమైన రీతులలో నిత్యవసర సరుకుల ధరలు పెరగడమే కాకుండా కులపిచ్చి, మత పిచ్చితో బీజేపీ పదేళ్ల పాలన కొనసాగుతున్నదని చెప్పారు.

ప్రస్తుతం భారతదేశం ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుందని మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానే సవరించి తమదే రాజ్యాంగ దేశాన్ని ఏలే అవకాశాలు లేకపోలేవని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని ఖూనీ చేసేలా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట సారంగాపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తిలార్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి, సాగర్ రెడ్డి, ఎంపీపీ అక్షర అనిల్ కుమార్, టీజేఏసీ చైర్మన్ ఆరెపల్లి విజయకుమార్, భూమన్న యాదవ్, వెంకటేశ్వరరాజు, కొట్టే శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News