హిందూపురంలో చరిత్ర సృష్టించిన బాలకృష్ణ
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి తిప్పెగౌడ నారాయణ్ దీపికపై 31,602 ఓట్ల మెజార్టీతో బాలయ్య గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. గత ఎన్నికల్లో జగన్ సునామీని సైతం తట్టుకొని దాదాపు 90, 704 ఓట్లు సాధించారు. 2014లో బాలకృష్ణకు 81,543 ఓట్లు వచ్చాయి.