Trending Now

సీఎం రేవంత్ తో టీఎస్​ఐఐసీ చైర్మన్ తూరుపు నిర్మల భేటీ

ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​జగ్గారెడ్డి సతీమణి, టీఎస్​ఐఐసీ చైర్మన్ తూరుపు నిర్మల, కుమారుడు భరత్ సాయి రెడ్డి కలిశారు. సీఎం ఇంటికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పలు కార్పొరేషన్​ పాలకవర్గం నియామకంలో నిర్మలను టీఎస్​ఐఐసీ చైర్మన్​గా నియమించిన విషయం తెలిసిందే. అలాగే ఆమె టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీగౌడ్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Related News