Trending Now

గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలి..

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: నిర్మల్ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన నిర్మల్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని వర్గాలకు సమ న్యాయం చేసే దిశగా అమలు చేస్తున్న వివిధ వినూత్నమైన సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామంలో ఇంటింటికి వివరించాలని సూచించారు గ్రామ, మండల, పట్టణంలోని వార్డు కమిటీలను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ.. ముందుకు వెళుతున్న ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను కూడా ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆయన గెలుపుకు ఇప్పటినుండే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ మండల స్థాయి ఆయా విభాగాల పదాధికారులు నాయకులు పాల్గొన్నారు.

మైనారిటీ నాయకుల డుమ్మా..!

నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే శ్రీహరి రావు నివాసంలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులలో అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు సోమవారం నిర్వహించిన ప్రతిష్టాత్మక సమావేశంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం పదాధికారులు,నాయకులు డుమ్మా కొట్టారు. సదరు సమావేశం ఉన్నట్లు ముందస్తుగానే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయా విభాగాల మండల పట్టణ వాడి స్థాయి నాయకులకు సమాచారం ఇచ్చిన నిర్మల్ నియోజకవర్గంలోని మండలాలు పట్టణం, వాడులకు సంబంధించిన ఆయా విభాగాల ముస్లిం మైనార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొనకపోవడం చర్చాంశానీయంగా మారింది.

Spread the love

Related News

Latest News