ప్రతిపక్షం, షాద్‌నగర్ : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ దూసుకువెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఒకసారి చుట్టేసిన ఆయన రెండో మారు ఇతర పార్టీలకు చెందిన పలుకుబడి ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న పార్టీని మరింత బలోపేతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలల సమక్షంలో బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీకి చెందిన ముఖ్యనేతలను పార్టీ కండువా కప్పుతున్నారు. ఇందులో భాగంగా చౌదరిగూడ మండలంలో బుధవారంనాడు ఆయన విస్తృత ప్రచారం చేస్తూ మరో పక్క బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలను పార్టీలో కి ఆహ్వానించారు. ముష్టిపల్లి మాజీ సర్పంచ్ కలాల్ యాదమ్మ తో పాటు ఆమె భర్త ఆంజనేయులుగౌడ్ ఆయన అనుచరులు దాదాపు 100 మంది కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు మండల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు