Trending Now

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

ప్రతిపక్షం, నేషనల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదపుతప్పి పిక్ అప్ వాహనం బోల్తా పడగా 14 మంది మృతి చెందారు. మరో 21 మందికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దిండోరిలోని బద్జార్ ఘాట్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. షాపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను, షాపురా హెల్త్ సెంటర్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love