Trending Now

బీఆర్​ఎస్​కు కోనప్ప గుడ్​బై.. సీఎం రేవంత్​తో భేటీ

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: బీఆర్​ఎస్​ పార్టీకి మరో నేత షాక్​ ఇచ్చేశారు. బీఎస్పీతో బీఆర్​ఎస్​ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోనేరు కోనప్ప బుధవారంనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో భేటీ అయ్యారు. సిర్పూర్​ నుంచి ఇటీవల బీఆర్​ఎస్​ తరపున పోటీ చేశారు. బీఎస్సీ నేత ప్రవీన్​కుమార్​ సైతం సిర్పూర్​ నుంచి పోటీ చేయడంతోనే నేను ఓడిపోయాన్న విషయాన్ని గులాబిబాస్​కు కోనప్ప చెప్పినట్లు సమాచారం. అయితే కోనప్ప మాటకు విరుద్దంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోనప్ప బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి త్వరలోనే కాంగ్రెస్​పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

Spread the love