Trending Now

కరీంనగర్ ప్రజలకు శుభవార్త.. జమ్మికుంటలో ఆగనున్న దాణాపూర్ ఎక్స్ ప్రెస్

ప్రతిపక్షం, కరీంనగర్ : దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ను జమ్మికుంటలో ఆపేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో స్వయంగా మాట్లాడారు. తప్పనిసరిగా జమ్మికుంటలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుండి దాణాపూర్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును జమ్మికుంట స్టేషన్ లో ఆగేలా ఏర్పాట్లు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Spread the love