ఓటు చోరీ చేస్తున్న కేంద్రం, సీఈసీ తీరుకు నిరసన.

*రాహుల్, ప్రియాంకల అక్రమ అరెస్టులు .

*లాఠీఛార్జ్ కు వ్యతిరేకంగా చౌటుప్పల్ లో కాంగ్రెస్ భారీ ధర్నా

ప్రతి పక్షం – చౌటుప్పల్, అక్టోబర్ 08: ఓటు చోరీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీరును నిరసిస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులు మరియు లాఠీఛార్జ్ ను ఖండిస్తూ చౌటుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది.బ్లాక్, మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో చౌటుప్పల్ లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటు చోరీకి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పై పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు ఇండియా కూటమి నేతలు చేపడుతున్న నిరసనలకు మద్దతుగా ఈ ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల కమిషన్ ను తమ చేతిలో పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై లాఠీఛార్జ్ చేసి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, ఈ దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో PACS చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News