Indian Athlete Navadeep Sing Won Gold: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వరుసగా భారత్‌కు పతకాలు సాధించి పెడుతున్నారు. అయితే ఈ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ నవదీప్ సింగ్ జాక్‌పాట్ కొట్టాడు. జావెలిన్ త్రోలో ఎఫ్ 41 విభాగంలో నవదీప్ సింగ్‌కు గోల్డ్ మెడల్ వచ్చింది. అయితే.. నవదీప్ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఉంది. తొలుత అతను రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. కానీ.. అనూహ్యంగా గోల్డ్ మెడల్ గెలిచిన ఇరాన్‌కు చెందిన సదేగ్‌పై పారాలింపిక్ కమిటీ నిబంధనలు అతిక్రమించినందుకు వేటు పడింది. దాంతో.. రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌కు గోల్డ్ మెడల్ దక్కింది.