Trending Now

ముస్లిం వివాహ చట్టం రద్దు.. అసోం సంచలన నిర్ణయం

ప్రతిపక్షం, నేషనల్: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్న అసోంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ దిశగా తొలి అడుగు వేసింది. సీఎం హిమంత శర్మ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935’ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర మంత్రి జయంత మల్లాబార్వా మాట్లాడుతూ, ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు వెల్లడించారు.

Spread the love